అంతర్రాష్ట్ర రహదారి పై గిడ్డి ఈశ్వరి మాట్లాడే హక్కు లేదు అనడం వైసిపి నేతల అహంకారం టిడిపి మండల అధ్యక్షుడు ముక్కలి రమేష్
గూడెం కొత్త వీధి అఖండ భూమి వెబ్ న్యూస్ :
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం అర్వినగర్ — పాలగెడ్డ రోడ్డు గురించి మాట్లాడే అర్హత మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి లేదని మండల వైసీపీ నాయకులు విమర్శించడం సరికాదని గూడెం కొత్తవీధి మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ముక్కలి రమేష్ అన్నారు. అర్వినగర్ , పాలగెడ్డ వరకు రహదారి నిర్మాణం కొరకు ప్రస్తుత పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి బాగ్యలక్ష్మి జాతీయ ఉపాధి హామీ పధకం ధ్వారా 4.30 కోట్ల రూపాయులు రహదారి నిర్మాణం నిమిత్తం మంజూరు చేయటం జరిగిందని, దీనికి సంబంధిచి పనులు చేపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని మాయ మాటలు ఎన్ని సార్లు చెబుతారని, ఇలాంటి మాయ మాటలు గతంలో అనేక సార్లు చెప్పారని ఇలాంటి మాయ మాటలకు అన్ని సార్లు ప్రజలు మోసపోరని హెద్దె వేశారు. గతంలో గిడ్డి ఈశ్వరి గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు దారకొండ నుండి గుమ్మిరేవుల కు, సప్పర్ల నుండి గాలికొండ వరకు, అలాగే సిగినపల్లి కి రహదారులను నిర్మించారని గుర్తుచేశారు. ఎలా చెప్పుకుంటూ పోతే పాడేరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని అందులో భాగంగా అనేక గ్రామాలకు గ్రావిటి స్కీమ్ ద్వారా త్రాగు నీరు, సిసి రోడ్లు, సోలార్ విద్యుత్ తో పాటు పలు గ్రామాలకు విధ్యుత్ సౌకార్యాన్ని కల్పించారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క గ్రామానికైనా అభివృద్ధి చేశారా అని ఎదురు ప్రశ్న వేశారు. అభివృద్ధి చేయటం చేతకాక ప్రశ్నించే వారికి తిరగపడటం వైసీపీ నాయకులకు కొత్తేమి కాదని విమర్శించారు. ఇదే అర్వినగర్ పాలగెడ్డ రహదారి నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో 84కోట్లు మంజూరు చేయగా ఇప్పటి ప్రభుత్వం మంజూరు అయినా రహదారి నిర్మాణ పనుల టెండర్ ను రివర్స్ టెండర్ అంటూ చేతులు ఎత్తివేసిన సంగతి అందరికి తెలుసని గుర్తుచేశారు. అయితే పాడేరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయుల అభివృద్ధి పనులు నిర్వీరంగా జరుగుతున్నాయని వీటిని పరిశీలించడానికి దమ్ముంటే నిజానిర్దారణ కమిటీ వేసి ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరిగిందాన్నదీ తెలుస్తుంది అని డిమాండ్ చేశారు. నిజానికి వాస్తవ పరిస్థితులు ప్రజలు గమనిస్తున్నారని వారి అగ్రహానికి ఎవరు చవిచుడవలసి వస్తుందో ముందుముందు తెలుస్తుందని హేచ్చారించారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..