సమన్వయకర్త వై వి సుబ్బారెడ్డి ప్రత్యేక సమావేశం

 

 

పాడేరు నియోజకవర్గ నాయకులతో ,కార్యకర్తలతో ఉత్తరాంద్ర ప్రాంతీయ సమన్వయకర్త వై వి సుబ్బారెడ్డి ప్రత్యేక సమావేశం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి/ పాడేరు అఖండ భూమి వెబ్ న్యూస్ :

అల్లూరిసీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో

బుధవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త , టిటిడి మాజీ చైర్మన్, వై వి సుబ్బారెడ్డి బుధవారం పాడేరు నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశం పాడేరులోని ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న వి.ఆర్ కళ్యాణమండపంలో ఉదయం 10 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ ట్రై కార్ చైర్మన్ సతక బుల్లి బాబు , వివిధ కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లు, ఏఎంసీ చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లు, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, కొయ్యూరు, జికే వీధి మండలాల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌లు, వైస్ స‌ర్పంచ్‌లు, మండల కన్వినర్లు,వార్డు స‌భ్యులు, పీఎసీఎస్ చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లు, వైయ‌స్ ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, గ్రామ స‌చివాల‌య క‌న్వీన‌ర్లు, గృహ‌సార‌ధులు హాజ‌రు కావాల్సిందిగా కోరుతున్నామని పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!