ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు మోసపోయాయి జ్యోతుల నెహ్రూ

 

ఈ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు మోసపోయాయి జ్యోతుల నెహ్రూ

వేలంకలో టిడిపి మహాశక్తి చైతన్య యాత్ర

కాకినాడ జిల్లా కిర్లంపూడిఆగష్టు 13: అఖండ భూమి రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని వైస్సార్సీపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల అన్నారు అన్నారు. కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలోతెలుగు మహిళల ఆధ్వర్యంలో జరిగిన మహాశిక్తి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు. అనంతరం భవిష్యత్తుకు గ్యారెంటీ, మహాశక్తి పథకాల కరపత్రాలు మహిళలతో కలిసి ఇంటింటికి పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎన్నికల ముందు బడుగు బలహీన వర్గాల మహిళలకు నలభై అయిదు సంవత్సరాలుకే పెంక్షన్ ఇస్తానని అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని, అమ్మ ఒడి ఎంత మంది బిడ్డలు చదువుకుంటే అంతమందికి తల్లుల ఖాతాలో వేస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక 15 వేలు వేయ్యకుండా కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే 13 వేలు వేస్తున్నారని, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి మహిళలను కట్టెల పొయ్యిలతో వంట చేరుకునే పరిస్థితి తెచ్చాడని, పెళ్లి కానుక తీసివేసి ఆడబిడ్డలకు అన్యాయం చేశాడని, మద్యపాన నిషేధం చేస్తానని నమ్మించి మహిళలచే ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని మద్యం షాపులను 20 సంవత్సరాలకు తాకట్టు పెట్టాడని అన్నారు. వైస్సార్సీపీ ప్రభుత్వం ఫీజ్ రేయంబర్స్మెంట్ ఇవ్వకపోవడం తో అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఫెంక్షన్ 3వేలు ఇస్తానని మోసం చేసాడన్నారు. ఆరోగ్యశ్రీ తో అన్నీ రకాల వైద్యం ఉచితంగా చేయిస్తానని నమ్మ బలికి మోసం చేశాడని, పేదలందరికి 25 లక్షల ఇల్లు కట్టిస్తానని మోసం చేసాడన్నారు.

 

డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక కేవలం 30% మందికి మాత్రమే ఇస్తున్నదని, మిగిలిన 70% మంది మహిళలు అసంతృప్తితో ఉన్నారని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం మహిళలను మోసం చేసిన ప్రభుత్వం అని, మహిళలు వైస్సార్సీపీ ప్రభుత్వ దుర్మార్గపు విధానాల పై తిరుగుబాటు చెయ్యాలని నెహ్రూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చదరం చంటిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దాపర్తి సీతారామయ్య, మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథం, గండే చిన్న తమ్మన్న, గండే చెల్లారావు, బేతాళ నారాయణమూర్తి, ఇంటి చెల్లారావు, ఇంటి తమ్మాజీ, గండే రాయుడు కుంచె శ్రీరామ కొండలరావు,,పోలినాటిధర్మానందకుమారినకిరెడ్డి సూర్యవతిగుమ్మల్ల అనంతలక్ష్మిరాపాక లక్ష్మికడారి లక్ష్మియల్లాటి అమ్మాజీ,గొల్లవిల్లి శ్రీదేవిగెద్దాడ సత్యవేణి,చెక్క మరియమ్మ,గుండుపల్లి సుజాత,గొల్లవిల్లి వరలక్ష్మి

తిప్పనసత్యవతి, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!