ఎర్రకోటపై జెండా ఎగరేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా పదో సారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాలకు శ్రీకారం చుట్టారు..
అంతకుముందు ప్రధాని మోదీ .. ఎర్రకోట దగ్గర త్రివిధ దళాల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు.
ప్రధాని మోదీ ప్రసంగం :
“ప్రపంచంలో మనది పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం విశ్వంలో నంబర్ 1గా ఉన్నాం. ఇంత విశాల దేశం.. 140 కోట్ల మంది జనాభాగా ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఎన్నో సమస్యలున్నాయి. కేంద్ర, రాష్ట్రాలు కలిసి.. సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. మణిపూర్‌లో, మరికొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. కొంతమంది జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఐతే.. కొన్ని రోజులుగా మళ్లీ శాంతి కనిపిస్తోంది. మణిపూర్ ప్రజలతో ఈ దేశం ఉంది. శాంతితోనే సమాధానం లభిస్తుంది. కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి.. శాంతిని నెలకొల్పుతాం.
అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీ సమాధి దగ్గర ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు



