మేడే స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు చేయాలి – సిఐటియు
బేతంచర్ల మే 01 (అఖండ భూమి) :
మే డే స్ఫూర్తితో కార్మికులందరినీ ఐక్య పోరాటాలకు సిద్ధం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రమేష్ కుమార్, సిఐటియు జిల్లా నాయకులు వై.ఎల్లయ్య,వైబి. వెంకటేశ్వర్లు,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆర్. ఈశ్వరయ్య లు కార్మికులను కర్షకులను కోరారు. సోమవారం స్థానిక మండల కేంద్రంలోని కొలుములపల్లి, బలపాలపల్లె,ఆర్.ఎస్. రంగాపురం,మరియు బేతంచర్ల పట్టణ కేంద్రంలో డ్రైవర్స్ కాలనీ,కోటపేట,కోటక్రిందిపేట, అంగళ్ళబజార్ సెంటర్లో, బనగానపల్లె రైల్వే గేట్ల దగ్గర, ఇసుక హమాలీల ఆఫీస్ దగ్గర, ప్లాట్ ఫారం హమాలీల దగ్గర, కారు,జీపు,డ్రైవర్ల ఆఫీస్ దగ్గర, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆఫీస్ దగ్గర,లారీ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ దగ్గర, 137వ మేడే సందర్భంగా సిఐటియు జెండాను దాదాపు 14 సెంటర్లలో సిఐటియు జెండాలను ఎగరవేయడం జరిగింది. 137 వ మేడే బహిరంగ సభ కార్యక్రమం సిఐటియు జిల్లా నాయకుడు వైబి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ జరిగింది. అనంతరం సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రమేష్ కుమార్ మాట్లాడుతూ భారత దేశ సంపదను ఆదాని, అంబానీలకు కట్టబెడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలు తెస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలపై ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని,మతతత్వ నిరంకుశ విధానాలపై పోరాడుతామన్నారు. సిఐటియు జిల్లా నాయకులు వై.ఎల్లయ్య మాట్లాడుతూ అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు రక్తం చిందించి,ప్రాణాలు అర్పించి 44 కార్మిక చట్టాలను మరియు ఎనిమిది గంటల పని,కనీస వేతన చట్టం అమలు సాధించుకునేంతవరకు కార్మికులందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆర్. ఈశ్వరయ్య మాట్లాడుతూ మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే అందులో 80 శాతం మంది రైతులు, వ్యవసాయ కార్మికులు,కౌలు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారన్నారు. 2004 పార్లమెంటు ఎన్నికల్లో వామపక్ష పార్టీలు 80 మందికి పైగా ఎంపీలు గెలుపొందడం జరిగింది.వామపక్ష పార్టీల ఎంపీల మద్దతుతో నాడు యూపీఏ 1 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడం జరిగింది.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పార్లమెంటులో చట్టం చేసి కేంద్ర ప్రభుత్వమే గ్రామీణ పేదలకు పనికి ఆహార పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి వంద రోజులు పని,రోజువేతనం వంద రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.2009 సంవత్సరంలో కూడా యూపీఏ 2, కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కాస్త న్యాయం జరిగిందన్నారు. 2014 సంవత్సరంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రతి ఏటా నిధులు తగ్గిస్తూ వస్తుందన్నారు. పొమ్మనలేక పొగ పెట్టినట్టు బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తి వేయడానికి కుట్రలు చేస్తుందన్నారు.భారతదేశ జనాభాకు అనుగుణంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రతి సంవత్సరం రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించాలన్నారు. కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు సాధించుకోవడానికి,రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం,ఉపాధి హామీ పథకాన్ని పగడ్బందీగా అమలు చేసుకోవడానికి కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకు సిద్ధం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ 137 వ మేడే బహిరంగ సభ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎన్.బాలయ్య,బి.సంజీవ నాయుడు,మండల ప్రధాన కార్యదర్శి ఎస్.రహమతుల్లా, యస్.ఖాజా,ఎస్.కె.భాష,కె. రాజబాబు,ఎన్.కె.నాగలక్ష్మి, ఆర్.వెంకటలక్ష్మి ,యస్.హుశేన్ భాష,సి.రాజు,వై.రాఘవరెడ్డి, పి.మల్లికార్జున,కె.రాముడు, ఎస్.మదార్ వలి,రంగడు, వలి,ఎన్వి.రమణ తలారి నాగేష్ లో,లతోపాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



