మే డే సందర్భంగా మజ్జిగ పంపిణీ……
బేతంచెర్ల పట్టణంలో సోమవారం మే డే సందర్భంగా వడ్డెర సంఘము ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ఉచిత మజ్జిగ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన వడ్డెర సంఘం నాయకులను ఆయన అభినందించారు. ఈ మజ్జిగ కార్యక్రమం వడ్డెర సంఘం నాయకులు వి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.



