బుక్ కీపర్ మాయాజాలం…

48 గ్రూపుల అక్రమ వసూలు…
పట్టించుకోని అధికారులు…?
ఇబ్బందుల్లో పొదుపు మహిళలు…
ఒక్కొక్క గ్రూప్ నుండి వేలకొద్ది దండుకుంటున్న వైనం…
వెల్దుర్తి మే 01(అఖండ భూమి) : పొదుపు మహిళల దగ్గర వేల కొద్ది దండుకుంటున్న బుక్కీపర్. 48 గ్రూపులలో అక్రమంగా వసూలు చేస్తున్న సంబంధిత అధికారులు మాత్రం నిమ్ముకునే వ్యక్తినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సభమని గ్రామానికి చెందిన ప్రజలు పాబోతున్నారు. పొదుపు మహిళలు ఇబ్బందుపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం పొదుపు మహిళలు వాపోతున్నారు. స్థానిక వెల్దుర్తి ఏపిఎం కార్యాలయం నందు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని పొదుపు మహిళలు ఆ పోయారు. దీంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తెలిపారు. స్థానిక అధికారులు విచారణ జరిపినట్లు తెలిపారు. గత పది రోజుల క్రిందట ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు అధికారులు బుక్ కీపర్ పై చర్యలు తీసుకున్న పాపాన పోలేదని పొదుపు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నా నుండి వసూలు చేసిన డబ్బులు మాకు ఇప్పించి బుక్ కీపర్ ను సస్పెండ్ చేయాలని పొదుపు మహిళలు డిమాండ్ చేస్తున్నారు.


