విద్యార్థిని విద్యార్థులు ఇష్టంతో చదివితే మంచిర్యాంకులు సాధిస్తారు…
పత్తికొండ (అఖండభూమి) విద్యార్థి విద్యా ర్థులు ఇష్టంతో చదివితే మంచి ఉన్నతమైన ర్యాంకులు సాధిస్తారని పత్తికొండ శాసనస భ్యురాలు శ్రీదేవమ్మ అన్నారు పట్టణంలో శ్రీ సాయి ప్రతిభ కళాశాల విద్యా ర్థిని జోష్ణ ఇం టర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్ష ఫలి తాలలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్ ,జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడం పత్తి కొండకు ఎంతో గర్వకారణం అని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ జోష్నకు అభినందనలు తెలియజేశారు. సోమవారం శ్రీ సాయి ప్రతి భ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆమె మాట్లాడుతూ ప్రతిభ ఉన్న పిల్లల ప్రోత్సాహానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని విద్యార్థిని,విద్యా ర్థులు చదువులను ఇష్టంతో చదవాలని, అ లా చదివినవారు తల్లిదండ్రులకు గురువు లకు కళాశాలలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారని, అలాంటి వారికి ప్రతిభ విద్యాసంస్థలు కూడా ఎల్లప్పుడూ తోడు ఉంటాయని ఎమ్మెల్యే తెలియ జేశా రు.ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ రామచంద్ర రెడ్డి ,ప్రతిభ విద్యా సంస్థల చైర్మన్ అరుణాచలరెడ్డి , కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు



