కోడుమూరు ఐసిడిఎస్ కార్యాలయంలో ఇష్ట రాజ్యాంగ ఉద్యోగులు..

కోడుమూరు మే 01 (అఖండ భూమి) : నియోజకవర్గ కేంద్రమైన కోడుమూరు పట్టణం నందు ఐసిడిఎస్ కార్యాలయంలో ఉద్యోగుల ఇస్టరాజ్యంగా మారింది. గత 11 రోజుల నుండి ఐసిడిఎస్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు తిరిగిన పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగులు వేళలు పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి తిరిగి వెళుతున్నారే తప్ప పనులు చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. 11, 12 గంటలు వ్యవధిలో కూడా అధికారులు కనిపించకపోవడంతో సమయాన్ని వృధా చేసుకొని వెనుతిరిగి పోతున్నారు. ఐసిడిఎస్ కార్యాలయం నందు కాలి కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అధికారులు వేళలు పాటించకపోవడం వలన బాలింతలకు గర్భిణీ స్త్రీలకు అందించాల్సిన పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించకుండ ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరిస్తున్నట్లు విశ్వనీయత సమాచారం. కోడుమూరు పట్టణానికి చెందిన బి మాధవి అనే బాలికకు మాతా శిశు సంరక్షణ పథకం కింద 2003 సంవత్సరం నందు ఫిక్స్డ్ డిపాజిట్ కింద రూ 5 వేల రూపాయలు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పథకం యొక్క వివరాలు తెలుసుకునేందుకు కార్యాలయానికి వెళ్తే అధికారులు కనపడకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రి బి మధు 11 రోజులుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న అధికారులు కనిపించకపోవడంతో మిన్నకుండిపోయాడు. సంబంధించిన జిల్లా శాఖ ఉన్నతాధికారులు కోడుమూరు ఐసిడిఎస్ అధికారులపై తగు చర్యలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోడుమూరు పట్టణ ప్రజలు కోరుతున్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


