హ్యాట్రిక్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డే : మచ్చర్ల సాగర్
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ప్రతినిధి (అఖండ భూమి) ఆగస్టు20: ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల కేంద్రంలో ఆదివారం
బీఆర్ఎస్ పార్టీ 60 ఓట్లకు ఒక బూత్ కమిటీ చొప్పున 163 బూతు కమిటీలను ఏర్పాటు చేసి 20 మంది ఇన్చార్జిలను ఏర్పాటు చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ నందిపేట్ మండలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భారీ ఓట్లతో గెలిపించేందుకు అందరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నందిపేట్ మండల కేంద్రంలో 12 కోట్ల రూపాయల తో డివైడర్ సెంట్రల్ లైటింగ్. 6 కోట్లతో సిసి డ్రైనేజీలు. రోడ్లు. వివిధ కుల సంఘాల కు కల్యాణ మండపాలు. కుల సంఘం భవనాలు మంజూరు చేసిన మూడవసారి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గెలిపించే విధంగా పక్క ప్రణాళికతో కష్టపడి పని చేయాలని ఆయన బూతు కమిటీ సభ్యులకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మెడ ఉషన్న. మంతెన శ్రీనివాస్. మంతెన హరిబాబు. ఆర్మూర్ చిన్న గంగారం. నాగ చిన్నయ్య. అశోక్ రెడ్డి గారి దినేష్. మచ్చర్ల సతీష్. నాగ శివ. సాకలి నరసయ్య. సాకలి దేవన్న. సుంకరి సుమన్. సుంకరి మహేష్. మంతెన చిన్నయ్య. ఎడ్డి గారి నరేష్. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..