ఇంత గొప్ప నాయకుడిని గుర్తించని మండల నాయకులు.

 

 

ఇంత గొప్ప నాయకుడిని గుర్తించని మండల నాయకులు.

– మండల ప్రజలకు ఏమి మేలు చేస్తారు.

అఖండ భూమి సూర్యాపేట జిల్లా అనంతగిరి అనంతగిరి

భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి అనంతగిరి మండల కేంద్రంలో నోచుకోకుండా కనుమరుగైపోయిందని పలువురు నాయకులు ఆరోపించారు. ఇంత గొప్ప నాయకుడిని మండలంలో మర్చిపోవడం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనుగడ లేకుండా పోయిందని నిరూపించుకున్నారు. మేము గొప్ప నాయకులమని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇది చెంపపెట్టుగా ఉందని నిర్ధారణమైంది. గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు ఇంత గొప్ప నాయకుడిని గుర్తించలేని వారు ప్రజలకు ఏమి మేలు చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశలు పడుతూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ప్రజలలో కారం చల్లినట్టుగా ఉందని పలువురి ప్రజలు ఆరోపించారు

Akhand Bhoomi News

error: Content is protected !!