ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి…
రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి.. . అఖండ భూమి సూర్యాపేట జిల్లా కోదాద్.
భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన జయంతి సందర్భంగా పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం దేశానికి అంకితం, యువతకు ఎన్నో మార్గదర్శకాలను దిశానిర్దేశం చేశాడని పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని రాజీవ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు టి పి సి రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, లంకెల నిరంజన్ కౌన్సిలర్లు గంధం యాదగిరి, కర్రి సుబ్బారావు, షేక్ బాగ్దాద్, కంపాటి శీను, పాలూరి సత్యనారాయణ,డేగ శ్రీధర్, బాల్ రెడ్డి,రేవూరి వెంకటాచారి, అక్కిరాజు రజనీకాంత్, బజన్,షేక్ బాబా,దాదావలి,శ్రీనివాస్ రెడ్డి, ఖలీల్, సైది బాబు, శోభన్, సాయి తదితరులు పాల్గొన్నారు….
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…