సబ్ ఇన్స్పెక్టర్ రఘునాధరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ
రికార్డులు సక్రమంగా లేకపోతే కఠిన చర్యల
రాజవొమ్మంగి అఖండ భూమి ఆగస్టు 2 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులు రికార్డులు సక్రమంగా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జడ్డంగి
సాబ్ ఇన్స్పెక్టర్ రఘునాధరావు హెచ్చరించారు.మండల కేంద్రమైన రాజవొమ్మంగి జడ్డంగి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం సాయంత్రంపోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథన్ రావు వాహనరికార్డులను పరిశీలించారు. కారు డిక్కీలు తనిఖీ చేశారు. గంజాయి సారాయి, మారక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారించడంలో భాగంగా పోలీసులుతనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ఏలేశ్వరం నుండి నర్సీపట్నం వచ్చి వెళ్లి పోయే వాహనాలను నిశితంగా పరిశీలించారు. వాహనదారులు రికార్డులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని, వాహన చట్టం నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని సబ్ ఇన్స్పెక్టర్ రఘునాధరావు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సబ్ ఇన్స్పెక్టర్ రఘునాథన్ రావు మరియు ఏపీఎస్పీ సిబ్బంది ఉన్నారు.
You may also like
ములగపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చైర్మన్గా కాపారపు శ్రీనివాస్ నియామకం.. సర్వత్రా హర్షం.
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం


