ఘరానా మోసం: హెయిర్ క్లిప్పుల రూపంలో బంగారం రవాణా..
హైదరాబద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు..
బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా అనుమానమొచ్చిన అధికారులు తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టయ్యింది. గాజులు ఇతర నగలు 18 క్యారెట్లు, 22 క్యారెట్లుగా గుర్తించారు.
ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదెరాబాద్ తరలించిన ఈ బంగారాన్ని పాక్స్ ప్రొఫైలింగ్, నిఘా విభాగం సమర్ధవంతంగా వ్యవహరించి పట్టుకున్నామని హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ జీఎస్టీ కస్టమ్స్ జోన్ అనే ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బంగారం మొత్తం 397 గ్రాములు ఉంటుందని దాని ఖరీదు సుమారు రూ.21 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



