సీనియర్ జర్నలిస్టు వెంకటరమణ ఆకస్మిక మృతి.
యస్ రాయవరం…….అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలంలో ఆంధ్రావాయిస్ దినపత్రికలో పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు నల్లల వెంకట రమణ ఆకస్మికంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం ఉదయం వెంకటరమణ కుమారుడు మధు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి పదిగంటల సమయంలో వెంకటరమణకు షుగర్ పెరగడంతో ఒళ్ళంతా చల్లబడి పోయినట్లు తెలిపారు. హుటాహుటిన నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పల్స్ పడిపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఏపిడబ్యుజెఎఫ్ యూనియన్ ప్రారంభంలో కీలకపాత్ర పోషించిన రమణ మృతిపట్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ ,కార్యదర్శి బి ఈశ్వరరావు, నియోజకవర్గ అధ్యక్షుడు పినపాతృని రామం, కార్యదర్శి కీర్తి కన్నబాబు, సీనియర్ జర్నలిస్టు ముత్తా గోవిందరావు, మొల్లేటి లక్ష్మీకుమారి, శ్రీనువాసరావు శేఖర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



