జై భీమ్ కు అవార్డు దక్కకపోవడం అన్యాయం

 

 

జై భీమ్ కు అవార్డు దక్కకపోవడం అన్యాయం

మండల మాలమహానాడు అధ్యక్షులు దేబార్కి ఆవేదన

వేపాడ ఆగస్టు 27(అఖండ భూమి):- డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన జై భీమ్ సినిమాకు ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవడం అన్యాయమని మండల మాలమహానాడు అధ్యక్షులు దేబార్కి కిరణ్ ఆవేదన వ్యక్తం చేసారు.ఒక దళిత స్త్రీకి జరిగిన అన్యాయంపై న్యాయం కోసం చేసిన పోరాటం కన్నా ఒక స్మగ్లర్ చేసిన పనికే ఎక్కువ విలువ ఇవ్వడం సమాజాన్ని తప్పుడు మార్గంలో నడిపించడమే అవుతుందని ఇటువంటి సందేశాలకు విలువనివ్వడం తగదన్నారు.జాతిపిత గాంధీజీ హత్యను సమర్డించేవారు బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకునే దౌర్భాగ్యం మన దేశాన్ని పాలించడం ప్రజలందరి దురదృష్టమన్నారు. దళితులకు సంబంధించి మూడు వేల సంవత్సరాలనుండి జరుగుతున్న అన్యాయం ఇదేకదా అని దేబార్కి కిరణ్ స్పష్టం చేసారు.ఇటువంటి దుస్సంఘటనపై మేధావులంతా మేల్కొని భవిష్యత్తులో ఇటువంటి దురా గతాలు జరగకుండా నిలువరించగలగాలని మండల మాలమహానాడు అధ్యక్షులు దేబార్కి కిరణ్ నినదించారు.

 

Akhand Bhoomi News

error: Content is protected !!