ఎమ్మెల్యే బోగస్ గిరిజనుల్ని ఎన్ని రోజులు కాపాడుతారో చూస్తాం : ఆదివాసి జెఏసి

 

ఎమ్మెల్యే బోగస్ గిరిజనుల్ని ఎన్ని రోజులు కాపాడుతారో చూస్తాం : ఆదివాసి జెఏసి

కొయ్యూరు అఖండ భూమి ఆగస్టు 27 అల్లూరు జిల్లా

పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి బోగస్ గిరిజనుల్ని ఎన్ని రోజులు కాపాడుతారో చూస్తామని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి నాయకులు అన్నారు. ఆదివారం కొయ్యూరు మండల కార్యవర్గం ఏర్పాటు సమావేశంలో పాల్గొన్న ఆదివాసి జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ ముట్టడం రాజబాబు మాట్లాడుతూ బోగస్ గిరిజనులను,గిరిజనేతరులను చెరో చెంకనెత్తికొని తిరుగుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆదివాసి జాతికి వ్యతిరేఖంగా పనిచేస్తున్నారని,బోగస్ గిరిజనులకు పదవులివ్వడం తో పాటు వారి కులం మీద విచారణను కూడా ఆపిస్తున్నారని,ఈ ప్రభుత్వం శాశ్వితం కాదు,ఈ ఎమ్మెల్యే శాశ్వతం కాదని,ఇవాళ కాకపోతే రేపైనా బోగస్ గిరిజనులు దొరుకుతారని,ఏ రోజైనా దొరుకకమానరని, భాగ్యలక్ష్మి ఎమ్మెల్యే పదవితో జాతికి ద్రోహం చేస్తున్నారని, అన్నారుజాతికి ద్రోహం చేసిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదని,ఎప్పుడు ఎమ్మెల్యేగా భాగ్యలక్ష్మీ ఉండరని,బోగస్ గిరిజనులకు భాగ్యలక్ష్మీ ఎలా కాపాడుతారో చూస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,రాష్ట్ర కార్యదర్శి సొనయి గంగరాజు,జిల్లా కన్వీనర్ రామరావుదొర,ఆదివాసి జెఏసి రాష్ట్ర మహిళ కమిటీ సభ్యులు శ్యామల వరలక్ష్మీ, జిల్లా నాయకులు మాకాడ బూరుగులయ్య,బూరుగు వెంకట్రావు,పాడి లోవరాజు,అరిమెల శ్రీరాములు,సంజీవ్,ఉల్లి సూరిబాబు,కొర్రు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!