విద్యుత్ ఉద్యోగుల ధర్నాకు హైకోర్టు అనుమతి..
అమరావతి: డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ సంఘాలు వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపి షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది..
ఈనెల 10న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30గంటలలోపు ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి సూచించింది.
ధర్నా నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్, ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది..
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



