దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఘన నివాళులు
రాజవొమ్మంగి అఖండ భూమి సెప్టెంబర్ 2 అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలంలో రాజవొమ్మంగి గ్రామంలో గాంధీ బొమ్మ సెంటర్లో మరియు అల్లూరి జంక్షన్ లో మాజీ ముఖ్యమంత్రివర్యు
లు వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఎనలేని ముద్రవేశారని, అదేవిధంగా తమ తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజన్న అడుగుజాడల్లో నడుస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు మన ప్రజలకు అందిస్తున్నారని వారు కొనియాడారు, అనంతరం డాక్టర్ వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఒడుగుల జ్యోతి, వైస్ ఎంపీపీ చప్ప చంద్రారాణి, జానుబాబు, ఎంపీటీసీ గంగాదుర్గాభవాని, వైఎస్ఆర్సిపి నాయకులు చిడిపల్లి అప్పారావు, నాగులపల్లి కుశరాజు, కనిగిరి వీరబాబు, చిడిపల్లి శాంతి కుమారి, బంటుపల్లి చంద్ర రావు, జెండా మూర్తి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి


