తుని నియోజక వర్గం కోటనందూరు మండలం లో మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బాబు తో నేను’ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమం లో మండలంలోని పలు గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటనందూరు మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడిందని డా బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పాలిస్తున్నారని అభివృద్ది ని గాలికొదిలేసి కక్ష సాధింపు చర్యలతో అక్రమ అరెస్టులతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఈ కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని యావత్ దేశమే ఖండించిందని ఆయన అన్నారు అంతే కాకుండా రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మరలా గాడి లో పడాలంటే రాష్ట్రాని కి చంద్రబాబు నాయుడు అవసరం ఉందని బుల్లిబాబు అన్నారు తప్పకుండా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని అందుకు ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో చింతకాయల కొండబాబు, అంకంరెడ్డి గోపి, కొండ్రుకళ్యాణ్, నెమ్మది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


