వాల్మీకి నగర్ లో తాటాకు ఇల్లు దగ్ధం
నిరాశరాలైన వృద్ధురాలు
రాజవొమ్మంగి అఖండ భూమి సెప్టెంబర్ 12 అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో జడ్డంగి పంచాయతీ వాల్మీకి నగర్లో బిత్తర వెంకయ్యమ్మ(70) సాయంత్రం నాలుగు గంటలకు టీ పెట్టుకోవడానికి పోయి వెలిగించగా అకస్మాత్తుగా మంటలు ఇంటికి పంచకు వున్న తాటాకులకు అంటుకొని మంటలు ఇల్లంతా వ్యాపించాయి ఆమె బయటకు వచ్చేసింది చుట్టుపక్కల ఉన్న యువకులు అంతా మంటలు అదుపు చేయయలని ప్రయత్నించిన అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమయింది ఈ విషయం తెలుసుకుని అడిషనల్ ఎస్ఐ ఎంఎస్ఎన్ రాజు వీఆర్వో సర్పంచ్ వార్డ్ మెంబర్లు ప్రదేశాన్ని చేరుకుని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా విద్యుత్ లైన్ ఆఫ్ చేశారు ఈ ప్రమాదంలో పదివేల రూపాయలు నగదు ఆధార్ కార్డు రేషన్ కార్డు నిత్యావసర సరుకులు దుస్తులు దగ్ధమయ్యాయి
వీఆర్వో సుమారుగా 40 వేల రూపాయలు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



