అసెంబ్లీ..ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా
విజయవాడ:ఏపీ అసెంబ్లీ సమావేశాలు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యలు ఆందోళనకు దిగారు..
ప్లకార్డులు చేతపట్టి, స్పీకర్ పోడియంను చుట్టు ముట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని, మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఏమాత్రం తగ్గని టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆందోళనను కొనసాగించారు. ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని స్పీకర్ పదేపదే చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో, సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో సభ ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడింది..
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…