జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
విజయవాడ: విజయవాడ వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది..
ఎంబీబీఎస్ కౌన్సిలింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ యూనివర్సిటీ వీసీకి మెమొరాండం ఇవ్వటానికి వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, పార్డీ నాయకులను యూనివర్సిటీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతూ మెమొరాండం ఇవ్వడానికి వచ్చిన తమపై పోలీసు ఆంక్షలు ఏంటంటూ రుద్రరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్య తోపులాట జరిగింది. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి బస్సులో పడేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పరిపాలనకు ఇది నిదర్శనమని, బ్రిటిష్ వారిపై స్వాతంత్ర్యం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నిర్బంధాలు కొత్తేమీ కాదని రుద్రరాజు తెలిపారు. రెచ్చగొట్టడం మానుకోవాలని పోలీసులకు ఆయన హితవు పలికారు. ఆందోళన తర్వాత కాంగ్రెస్ నాయకులు వీసీకి వినతిపత్రం సమర్పించారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



