సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు
దిల్లీ: సనాతన ధర్మం పై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే..
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు చేరింది. ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. తమిళనాడు ప్రభుత్వం, ఉదయనిధికి నోటీసులు జారీ చేసింది.
ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి మాట్లాడుతూ.. ”సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి” అంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. దీంతో ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ 262 మంది ప్రముఖులు.. భారత ప్రధాన న్యాయమూర్తి కి లేఖ రాశారు. ఇందులో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇక ఉదయనిధిపై పలు రాష్ట్రాల్లో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి..
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



