ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం.. ఎయిర్‌రైఫిల్‌లో ప్రపంచ రికార్డు
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ అథ్లెట్ల హవా ప్రారంభమైంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో టీమ్‌ఇండియా స్వర్ణ పతకం సాధించింది.
ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్, తోమర్‌తో కూడిన బృందం ఫైనల్‌లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఖాతాలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి.
10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్, దివ్యాన్ష్, తోమర్ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్ మూడో స్థానం, తోమర్ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు మెన్స్ ఫోర్ రోయింగ్ ఈవెంట్‌లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది.
You may also like
సీ ఈ సీ రాజీనామాకు 48 గంటల గడువు… కాక్రోచ్ జనతా పార్టీ
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.



