ప్రజల చెంతకు ప్రజానేత అది రాత్రైనా… జోరువానైనా…

అనపర్తి :అఖండ భూమి
* గడప గడపనా సంక్షేమ ఫలాలు
* అన్ని వర్గాల వారికి ఆర్థిక స్వావలంబన
* కోవిడ్ కష్ట కాలంలోను ఆగని సంక్షేమం
* అర్హత ఆధారంగా సంక్షేమ పథకాల వర్తింపు
* నవరత్నాలతో ప్రగతి బాటన నవ్యాంధ్రప్రదేశ్
* సమస్యల పరిష్కారానికై గడప గడపకూ
* జన నీరాజనాలు అందుకుంటున్న డాక్టరన్న
నాలుగున్నరేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేకూర్చిన సంక్షేమ లబ్దిని గడప గడపకూ వివరిస్తూ… మున్ముందుకు సాగుతున్నారు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన స్థానిక సమస్యల పరిష్కారానికై అక్కడికక్కడే… అప్పటికప్పుడే… అధికారులకు ఆదేశాలిస్తూ తక్షణ పరిష్కారాలకు చర్యలు తీసుకుంటున్నారు. తాను కలిసిన ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ చిత్తశుద్ధితో పనిచేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో ఆర్థిక బలాన్ని ఇచ్చి వెలుగులు నింపుతున్నాయని అన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో తక్షణ సమస్యల పరిష్కారానికి రూ. 20 లక్షలు మంజూరు చేయడం ప్రజా సమస్యల పరిష్కారం పట్ల జగనన్న చిత్తశుద్ధిని చాటుకున్నారన్నారు. ఏ ఇంటికి వెళ్లినా… సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందోత్సవాలతో స్వాగతం పలుకుతున్నారన్నారు. అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామ గ్రామాన ప్రతీ గడపకు వెళుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల రూపకల్పన ద్వారా ప్రభుత్వానికి లబ్ధిదారులకు మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపి చేకూరుస్తున్న తీరును సోదాహరణంగా ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. అర్హత ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఇంటి వద్ద అందించేందుకు వీలుగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి వాలంటీర్ల ద్వారా అనుసంధానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారని ప్రజలకు స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి మేలైన, మెరుగైన సేవలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని ప్రజలకు తెలిపారు. నాడు – నేడు పథకం ద్వారా సర్కారు బడులను ఆధునీకరించడం, విద్యాసంస్కరణల ద్వారా కార్పొరేట్ విద్యకు ధీటుగా పేద విద్యార్థులకు అందచేస్తున్న సంస్కర్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే వివరించారు. ప్రతి సచివాలయ పరిధిలో ఒక వెల్నెస్ సెంటర్ ని ఏర్పాటు చేసి అత్యవసర వైద్యాన్ని ముఖ్యమంత్రి అందుబాటులోకి తీసుకొచ్చారని తెలియజేశారు. ఆదరించి అక్కున చేర్చుకుంటున్న ప్రజలతో మమేకమై సాగుతున్న గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం అది రాత్రైనా… జోరువానైనా… ఆయన వెనకడుకేసే ప్రసక్తే ఉండదు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతూ… ప్రతి గడపనూ స్పృశిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఆయన వస్తుంటే గ్రామాల్లోని వీధులన్నీ సందడిని సంతరించు కుంటున్నాయి. ఆయన వెంట జనం తండోపతండాలుగా కదులుతున్నారు. డాక్టర్ అన్న మా ఇంటికి వచ్చారంటూ పూలమాలలు, మంగళ హారతులతో స్వాగతాలు… జై జగనన్న… జై జై డాక్టరన్న… నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
పెల్లుబుకుతున్న జనస్పందన… అందిస్తున్న జననీరాజనాలతో… ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. గ్రామ గ్రామాన అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ప్రజాదండు వెంటరాగా గడపగడపకు వెళ్లి నాలుగేళ్ల అభివృద్ధి, సంక్షేమ ఫలాలను వివరిస్తూ… సమస్యలు తెలుసుకుంటూ… వాటిని పరిష్కరిస్తూ మున్ముందుకు సాగుతున్నారు.


