పుదుచ్చేరి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు కీ:శే: గొల్లపల్లి గంగాధర ప్రతాప్ 18వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు.
యానం (అఖండ భూమి) యానం ప్రజలు నాటికీ నేటికి-ఎన్నటికీ మరువలేని మహోన్నత వ్యక్తి- మహాశక్తి యానం నియోజవర్గ ప్రజల గుండెచప్పుడు- బడుగు-బలహీన వర్గాల ఆశాజ్యోతి- పిలిస్తే పలికే వ్యక్తి- యానం నియోజవర్గ ప్రజలకు ఆపదలో నేనున్నానని తలుపు-తట్టే వ్యక్తి కీర్తిశేషులు:శ్రీ:గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ 18 వ వర్ధంతి పురస్కరించుకుని యానం కె.జంక్షన్లో గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన ఆయన అభిమానులు- కార్యకర్తలు-కుటుంబ సభ్యులు-స్నేహితులు- మహిళా-కార్యకర్తల నడుమ ఈ కార్యక్రమము ఘనముగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ గొల్లపల్లి గంగాధర్ ప్రతాప్ నేటికి చనిపోయి 18 సంవత్సరాలు గడిచినను, గంగాధర్ ప్రతాప్ జయంతి- వర్ధంతి-లను ఆయన అభిమానుల నడుమ క్రమం తప్పకుండా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండపాక సత్తిబాబు,గంగాధర్, సుబ్బారావు,హరి,వాసు,లంకే లోవరాజు, మధు,లక్ష్మి,కృపావతి, కర్రి నాగమణి, తిరుకోటినాగమణి,అనిత,కొమ్ము కుమారి, తదితరులు పాల్గొని గంగాధర్ ప్రతాప్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.



