శ్రీలలితాదేవి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు
మహిషాసురమర్దనీ దేవి గా అమ్మవారు
యానం
(అఖండ భూమి) యానంలో వేంచేసిన శ్రీ లలితాదేవి నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు మహిషాసుర మర్దని దేవిగా అవతరించి భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు మానేపల్లి గణేష్. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ
మహిషాసురమర్దనీ దేవి
దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము సర్వ-సిద్ధులను ప్రసాదించే శక్తి అవతారం
దుర్గాదేవి మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుందని పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది
నవజాత దుర్గ సింహంపై స్వారీ చేస్తూ మహిషాసురుడిపై యుద్ధం చేసి అతన్ని చంపింది
అందువలన ఆమెకు మహిషాసురమర్దిని అని పేరు వచ్చిందని
ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయని సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుందని ఈ తల్లి అనుగ్రహం కలిగితే లోకంలో సాధించలేనిది ఏదీ ఉండదని
మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయని ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని
అమ్మవారికి ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా అనే మంత్రాన్ని జపించాలని ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తెలిపారు.



