కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు ఆదేశాలతో “దేశం చేస్తుంది రావణాసుర దహనం – మనం చేద్దాం జగణాసుర దహనం” అనే కార్యక్రమంను మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్య కర్తలు “సైకో పోవాలి సైకిల్ రావాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా అంకంరెడ్డి బుల్లి బాబు మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ లతో ప్రభుత్వాన్ని నడపడం ప్రజాస్వామ్య విరుద్ధమని రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆయన అన్నారు మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి కక్ష పూరితమైన అక్రమ కేసులను ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని వచ్చే ఎన్నికలలో ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, చింతకాయల కొండబాబు, చింతకాయల సురేష్ కుమార్, కొండ్రు కళ్యాణ్,ఎస్.సి.సెల్ కార్యదర్శి నెమ్మాది సత్యనారాయణ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

ANDHRA BREAKING NEWS NEWS PAPER POLITICS

