కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంపై మావోల లేఖ.. కేసీఆర్‌పై సంచలన కామెంట్స్
వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) కుంగడంపై మావోయిస్టులు లేఖ (Maoist Letter) విడుదల చేశారు. ప్రాజెక్ట్ కుంగిపోడానికి పూర్తి బాధ్యత సీఎం కేసీఆర్ (CM KCR) వహించాలన్నారు..
మావోయిస్టు జేఎమ్‌డబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ అంతరాష్ట్ర వంతెన పిల్లర్లు 30 మీటర్లు కుంగి పోవడానికి కారణం నాణ్యత లోపమే అని అన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేడిగడ్డ బ్యారేజీని నిర్మించి కేవలం మూడు సంవత్సరాలే అయిందని.. దీన్ని 2016 మే 2వ న నిర్మాణం చేపట్టి 2019 జూన్ 21న ప్రారంభించారని తెలిపారు..
ఈ బ్యారేజీ త్వరలోనే కూలి పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబమే అని లేఖలో తెలిపారు. పెద్ద మొత్తంలో కమీషన్లు తీసుకుని నాసిరకంగా నిర్మించారని విమర్శించారు. అది నిర్మిస్తున్న సమయంలోనే పగుళ్లు ఏర్పడ్డాయి… కానీ ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదన్నారు..
ప్రజలను, ప్రజాసంఘాలను, బూర్జువా పార్టీలను సహితం రానివ్వకుండా అడ్డుకున్నారన్నారు. పోలీసు ఫోర్స్‌తో ముందస్తుగా అరెస్టులు చేసి వారిని ధర్నాలు, ర్యాలీలు చేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. విషయం బయటకు రాకుండా అణిచివేశారని… మీడియాను కూడా బెదిరించి కంట్రోల్ చేశారన్నారు. ప్రజాధనం వృధా చేసిన కేసీఆర్ దే పూర్తి బాధ్యత అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు..
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



