ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయాలి

 

 

ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయాలి .

గంగవరం/రంపచోడవరం.( అఖండ భూమి న్యూస్) :- ఏజెన్సీ పరిధిలో 11 మండలాలలో ఓటర్ జాబితాలో తప్పులు సరి చేయుటకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల సవరణ కొరకు తగు చర్యలు తీసుకోవడం జరిగిందని రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ వారి కార్యాలయ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ సవరణ ప్రక్రియ గురించి సబ్ కలెక్టర్ సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం బన్సల్ మాట్లాడుతూ 53 రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో 11 మండలాలలో ఎన్నికల సంఘం నిబంధన మేరకు బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల పేర్లు తప్పులు ఉన్న వాటిని సరి చేయుటకు బూత్ స్థాయి అధికారులను సర్వే చేయుటకు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 399 పోలింగ్ బూతులకు ప్రస్తుతం రెండు లక్షల 72 వేల నలుగురు ఓటర్లు కలరని ఆయన తెలిపారు. అదేవిధంగా 20-10-2023 నుండి 26-10-2023 వరకు ఫారం 6 ద్వారా ఓటర్ల నమోదు కొరకు 34 దరఖాస్తులు. ఫారం7 ద్వారా చనిపోయిన వారి పేర్లు 711. ఫారం 8 ద్వారా ఓటర్ పేర్లలో తప్పులు. ఫోటోలు సరిగ్గా లేనియెడల సరి చేయుటకు 50 దరఖాస్తులు రావడం జరిగిందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముందు రోజు వరకు ఓటర్ల జాబితాలో ఏమైనా సమస్యలు ఉన్నాయెడల సంబంధిత ఫారములు ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రజలను ఆయన కోరారు. ఓటర్ కార్డులకు ఆధార్ అనుసంధానం సుమారు 79 శాతం వరకు పూర్తయినవని ఆయన తెలిపారు. 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులు ఓటర్ కార్డులు దరఖాస్తు చేసుకునే విధంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నవంబర్ నెల 4వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు అదేవిధంగా డిసెంబర్ నెలలో రెండవ తారీకు మూడో తారీఖు వరకు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం ఐదు గంటల వరకు ఎన్నికల పోలింగ్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల బూతులు. ఓటర్ కార్డులో తప్పులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్న ఎడల తెలియజేయాలని వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులను సబ్ కలెక్టర్ కోరారు. ఓటర్ సవరణకు సంబంధించిన వివరాలు ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు సర్క్యూట్ చేయడం జరుగుతుందని అదేవిధంగా ఇంకా ఎక్కడైనా పోలింగ్ బూతులు ఏర్పాటు అవసరమాగు చిన్నదని లికిత పూర్వకంగా దరఖాస్తులు సమర్పించిన యెడల ప్రతిపాదన జిల్లా కలెక్టర్ వారికి సమర్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కె. బాలకృష్ణ.ఎస్. బోజ్జి రెడ్డి. పి. శ్రీనివాసరావు . మడకం వరప్రసాద్ దొర .డిప్యూటీ తాసిల్దార్ యన్. వి.వి. సత్యనారాయణ. సీనియర్ అసిస్టెంట్లు డి.ఇందిరాబాయి. టి.లక్ష్మణ్. తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!