నాలుగు వారాలపాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌… 

 

 

నాలుగు వారాలపాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌…

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. 4 వారాల పాటు ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. *అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు* చేయాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు *నేడు న్యాయమూర్తి జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్‌ వేశారు.

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా.. మరో సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు.* రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని.. కంటికి ఆపరేషన్‌ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది

Akhand Bhoomi News

error: Content is protected !!