ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయండి

 

 

ప్రజా రక్షణ భేరి బస్సు యాత్రను జయప్రదం చేయండి

పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్న, సిపిఎం నాయకులు

రాజవొమ్మంగి అఖండ భూమి అక్టోబర్ 31 అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్

రాజవొమ్మంగి మండలం, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు అక్టోబర్ 30 సోమవారం సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశం కోసూరి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లోత రామారావు, మాట్లాడుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మూడు బస్సు యాత్రలు సాగుతున్నాయని, అందులో గిరిజన ప్రాంతమంతా ఒక బస్సు యాత్ర నడుస్తుందని, నవంబర్ 4,5, తేదీల్లో రంపచోడవరం నియోజకవర్గం లో బస్సు యాత్ర సాగుతుందన్నారు,

రాష్ట్రాన్ని విడగొట్టి పదేళ్లు పూర్తి కావస్తుంది, ఇప్పుడు మనకు దేశంలో రాష్ట్రంలో ఏలుతున్న పార్టీలు అరచేతిలో స్వర్గం చూపించారు, కేంద్రంలోని బిజెపి నాయకులు, ప్రత్యేక హోదా జాతీయ ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, రాజధాని నిర్మాణం, వంటి విభజన హామీలో ఏ ఒక్కటి అమలు చేయకపోగా, ఈ రాష్ట్రం ప్రభుత్వ సంస్థలను విశాఖ ఉక్కు, కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలుకుతున్నాయి ,

ఈ రాష్ట్రంలో వైయస్సార్ పార్టీ ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు నవరత్నాలు, సంక్షేమమని పాటలు పాడుతున్న, నాయకులు, నాలుగున్నర సంవత్సరాలలో ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క రహదారి కూడా నిర్మాణం చేయలేదని, ఆరోగ్యం అందుబాటులో లేక, ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ రాక డోలుమోతలో ఆదివాసులు పిట్టల రాలిపోతున్న గ్రామానికి రహదారి సౌకర్యం కల్పిద్దామని కుడా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు లేదనిఅన్నారు, అందుకే ఏజెన్సీ అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సిపిఎం పార్టీ ఒక ప్రత్యామ్నాయ విధానాలతో, ముందుకు సాగుతుంది అందులో భాగంగానే, రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేసి నవంబర్ 15వ తేదీన విజయవాడ నడి ఒడ్డున వేలాది మందితో భారీ బహిరంగ సభ పెడుతున్నామని అన్నారు,

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు, కోండ్ల సూరిబాబు, తాటితూరి శ్రీనివాస్, కుంజం జగన్నాధం, కాదుల దొరబాబు, పొత్తురు రాంబాబు, పొత్తురు సత్యనారాయణ, కాదుల ప్రవీణ్, పెయ్యాల పాపారావు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!