కోటనందూరు మండలం లక్ష్మీదేవి పేట గ్రామంలో మండల టీడీపీ ఉపాధ్యక్షులు పెనుముచ్చి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మండల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి “బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ” కార్యక్రమం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తుని నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య హాజరయ్యారు.గ్రామంలో ఇంటి ఇంటికి తిరుగుతూ రాష్ట్ర భవిష్యత్తుకు,మన భవిష్యత్తు కు చంద్రబాబు గ్యారెంటీ అని ప్రజలకు భవిష్యత్తు గ్యారెంటీ కర పత్రాలు పంచిపెట్టారు. గ్రామం లో మహిళలు పెద్ద ఎత్తున హారతులు తో యనమల దివ్యకు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు గాడి రాజుబాబు, సుర్ల లోవరాజు, బోడపాటి సత్యనారాయణ, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్,కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్, టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్, అంకంరెడ్డి బుల్లిబాబు, గొంప మహేంద్ర పెనుముచ్చి ప్రవీణ్, పసగడుగుల ప్రసాద్, కొండ్రు కళ్యాణ్, ముప్పం లోవరాజు మరియు మండల టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
You may also like
అట్రాసిటీ కేసులలో దళితులకు అన్యాయం జరిగితే సహించబోము .. మాల మహానాడు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. శ్రీనివాసరావు
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
కోతముక్కపేకాటపై పోలీసుల దాడి


