వెల్దుర్తిలో టిడిపి నాయకుల సంబరాలు..
వెల్దుర్తి అక్టోబర్ 31 (అఖండ భూమి) : వెల్దుర్తి పట్టణం నందు టిడిపి నాయకులు మంగళవారం టిడిపి మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు విడుదల సందర్భంగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ…టిడిపి జాతీయ నాయకులు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల కావడం పట్ల టిడిపి నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనారోగ్యం పట్ల నారా చంద్రబాబు నాయుడు హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించడం జరిగింది. అదే తరుణంలో స్కీవాష్ పిటిషన్ విచారణ జరపాలని తెలిపారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటికి వచ్చినప్పుడే టిడిపి శ్రేణులం ఆనందాన్ని వ్యక్తం చేస్తామని వెల్లడించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి, తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు .ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ సీఎం డౌన్ డౌన్, సైకో పోవాలి,,, సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు టి బలరాం గౌడ్, వీరభద్రుడు, ఎర్ర బజారు, సుధాకర్ గౌడ్, మల్లెపల్లి మురళీధర్ రెడ్డి, మెకానిక్ నారాయణ, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



