ఊలపల్లి ఉన్నత పాఠశాలను సందర్శించిన టి ఏ అర్ ఎల్ జిల్లా కోఆర్డినేటర్
బిక్కవోలు :అఖండ భూమి వెబ్ న్యూస్ :
ఈరోజు ఊలపల్లి లోని శ్రీ ముల్లంగి బులి వీరన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ను తూర్పుగోదావరి జిల్లా టి ఏ అర్ ఎల్ కార్యక్రమంనకు ప్రథం సంస్థ తరఫున జిల్లా కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న గెళ్ళ సురేష్ నాని సందర్శించడం జరిగింది. పాఠశాలలో 3,4,5 తరగతులలో తెలుగు మరియు గణితము సబ్జెక్టులలో విద్యార్థులలో అభ్యసన స్థాయిని పెంచేందుకు రూపొందించబడిన టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కార్యక్రమ అమలు తీరు, రిజిస్టర్ల నిర్వహణ, విద్యార్థుల ప్రగతి, ఉపాధ్యాయుల బోధనా పద్ధతి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో కార్యక్రమం మరింత ప్రభావవంతంగా నిర్వహించుటకు తెలుగు గణితము బోధిస్తున్న ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేసిరి.కార్యక్రమం లోపాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొవ్వూరి అమ్మిరెడ్డి ఉపాధ్యాయులు బి. జ్యోతి కె.బాల కుమారి పాల్గొనిరి.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
విద్యార్థులకు సైబర్ నేరాలపై బాల్య వివాహాలపై అవగాహన
లోకోస్ పై వీఓఏల శిక్షణ కార్యక్రమం
న్యాయవాద వృత్తిలో యువతకు భరోసా కల్పించండి: కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన విశాఖపట్నం బార్ అసోసియేషన్.
రాష్ట్రంలో విద్య దోపిడి భయంకరంగా ఉన్నది,



