సూర్యాపేట లో బీఎస్పీ కి షాక్

 

 

సూర్యాపేట లో బీఎస్పీ కి షాక్

సూర్యాపేట లోని విద్యానగర్ పార్టీ కార్యాలయం లో గులాబీ కండువా కప్పి స్వాగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట, నవంబర్ 6, (అఖండ భూమి) మత్స్యకార వృత్తిని ప్రోత్సహించి మా జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ వైపే మా ప్రయాణం అంటూ సూర్యాపేట లో మత్స్యకారులు తేల్చిచెప్పారు. తెలిసో తెలియక బీఎస్పీ లోకి వెళ్ళిన తాము తిరిగి బీఆర్ఎస్ పార్టీ లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేట లోని 13 వ వార్డ్ గాంధీనగర్ కు చెందిన మత్స్య పారిశ్రామిక సంఘం

సభ్యులు బి. ఎస్పీ కి రాజీనామా చేసి మూకుమ్మడిగా బీఆర్ఎస్ లో చేరారు. విద్యానగర్ లోని పార్టీ కార్యాలయం వద్ద గులాబీ కండువాతో మంత్రి జగదీష్ రెడ్డి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో బంటు మారయ్య, దువ్వ మల్లేష్, గోడదాటి సైదులు, దాసరి ఉప్పలయ్య, తిరుపతి రవి, మొర రామచంద్రు, చెన్నబోయిన అంజయ్య, లక్ష్మయ్య, బుచ్చి బాబు తో పాటు వంద మంది మత్స్యకారులు బీఆర్ఎస్ లో చేరారు..13 వ వార్డ్ అధ్యక్షుడు రఫీ, జనార్దన్ ఆధ్వర్యం లో చేరికలు జరిగాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!