గుంటసీమ గ్రామానికి బస్ సౌకర్యం కల్పించండి….

 

 

గుంటసీమ గ్రామానికి బస్ సౌకర్యం కల్పించండి….

డుంబ్రిగుడ. నవంబర్ 12. (అఖండ భూమి ):డుంబ్రిగుడ నుండి మారుమూల గుంటసీమకు ఆర్టీసి బస్ సౌకర్యం కల్పించాలని మానవ హక్కుల నేర నిరోధక సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కమ్మిడి. కృష్ణకుమారి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆమె ఈ సందర్బంగా మాట్లాడుతూ పాడేరు, హుకుంపేట, అరకులోయ మండలాల నుండి ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఇతర శాఖలకు సంబందించిన ఉద్యోగులు మండల కేంద్రమైన డుంబ్రిగుడ కు బస్సుల్లో వచ్చి ఇక్కడ నుంచి గుంటసీమ, లైగండ, రంగులిసింగి, తూటంగి, గుంట గన్నెల అర్మ తదితర పంచాయతీలలోని వివిధ గ్రామాలకు వెళుతుంటారని, అయితే బస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతూ, జీపులను, ఆటోలలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారని, గతంలో రహదారి సౌకర్యం సరిగా లేకున్నా బస్సు రోజుకు మూడు ట్రిప్పులు తిరిగేదని, ప్రస్తుతం డుంబ్రిగుడ నుండి గుంటసీమ రహదారి చాలా బాగుందని, పాడేరు ఆర్టీసి డిపో మేనేజర్ రూట్ సర్వే చేసి తక్షణమే బస్సు సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి తగు చర్యలు గైకొని ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని కృష్ణకుమారి విజ్ఞప్తి చేసారు.

Akhand Bhoomi News

error: Content is protected !!