రెండో రోజు కొనసాగుతున్న టూరిజం కార్మికుల నిరవేదిక సమ్మె

 

రెండో రోజు కొనసాగుతున్న టూరిజం కార్మికుల నిరవేదిక సమ్మె

– డైలీ వేజ్ కార్మికులందరిని అప్కాస్ లో కలపాలి.

– టూరిజం కార్మికుల డిమాండ్లపై మొండివైఖరి తగదు. జిల్లా అధ్యక్షులు గుజ్జెల గురు.

అల్లూరి జిల్లా :అనంతగిరి (అఖండ భూమి) నవంబర్ 12:అల్లూరి జిల్లాలో పనిచేస్తున్న ఆరు యూనిట్ల ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ కార్మికులు తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అనంతగిరి మండలం కొండిబ పంచాయితీ తైడ ఏపీ టూరిజం యూనిట్లో రెండో రోజు సమ్మె జిల్లా అధ్యక్షులు గుజ్జల గురు, ఉపాధ్యక్షులు ఏ. సంజీవరావు, రాష్ట్ర అధ్యక్షులు ఆర్. వి. నరసింహారాజు ఆధ్వర్యంలో దిగ్విజయంగా కొనసాగుతుంది.కార్యక్రమంలో ఏపీటీడీసీ జిల్లా అధ్యక్షులు గుజ్జెల గురు మాట్లాడుతూ టూరిజం కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందని, తమ చేత ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందని కనీస వేతనం చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో టూరిజం కార్పొరేషన్ ఒప్పందం అమలు చేయకుండా మొండి చెయ్యి చూపటం సరికాదని ఎద్దేవా చేశారు. కార్మికుల యొక్క ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకుని పరిష్కరించకపోతే మరిన్ని అఖిలపక్ష సంఘాలతో సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

టూరిజం కార్మికుల డిమాండ్లు

– టూరిజం కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి.

– గతంలో చేసుకున్న 10-10-2010 సం॥లో టూరిజం కార్పొరేషన్ యాజ మాన్యం చేసిన ఒప్పందం అమలు చేయాలి.

– కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ హెచ్.ఆర్ పాలసీని అమలు చేయాలి.

– సర్వీసు మరియు క్వాలిఫికేషన్ పద్ధతిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసి కాంట్రాక్ట్ మరియు జౌట్సోర్సింగ్ కార్మికులకు పదోన్నతి కల్పించాలి.

– డైలీ వేజ్ కార్మికులందరిని అప్కాస్ లో కలపాలి.

– కార్పొరేషన్ లో పనిచేసిన కార్మికులందరికీ గ్రాడ్యూటీ అమలు చేయాలి. కార్యక్రమంలో జి లక్ష్మణ, పి చందు, వై జి లింగేశ్, అప్పారావు, అక్కు నాయుడు, బోడ్లాల్, సతీష్, వీరబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!