మానవత్వం చాటుకున్న డా||బంగారయ్య

 

 

మానవత్వం చాటుకున్న డా||బంగారయ్య
ఎస్. రాయవరం మండలం, ధర్మవరం అగ్రహారం గ్రామంలో జోగ మంగ,రమణ దంపతులు పూరిగుడిసెలో నివసిస్తున్నారు. శుక్రవారం రాత్రి గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో నిత్యవసర వస్తువులు, బంగారం, వెండి నగలు, జగనన్న ఇల్లు నిర్మాణం కొరకు అప్పు తెచ్చుకున్న డబ్బులు అగ్ని ఆహుతిలో కలిసిపోవటం వల్ల చాలా ధన నష్టం కలిగి కుటుంబం అంతా కట్టుబట్టలతో నడి రోడ్డుపై ఉన్నారు. గ్రామ ఎంపీటీసీ సియ్యాదుల వరహాలు, మాజీ సర్పంచ్ వెదుళ్ల బంగారి,లోవరాజు పలువురు గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం డా|| బంగారయ్య ఆ కుటుంబ

సభ్యులను పరామర్శించి వారికీ నిత్యవసర సరుకులు, ధన సహాయం అందించారు. వారికీ మరింత సహాయం అందించేందుకు సాయ శక్తుల ప్రయత్నం చేస్తానని డాక్టర్ బంగారయ్య వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అచ్యుత్, బంగారి, అప్పలరాజు లు మాట్లాడుతూ డా|| బంగారయ్య మన నియోజకవర్గ ప్రజలకు ఒక్క వైద్య సహాయంమే కాకుండా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ఆదుకుంటున్నారు. ఆయన చేసే సేవలు ఎనలేనివి అని మనమంతా ఆయన ఋణం తీర్చుకోవాలి. రానున్న కాలంలో ఆయన మంచి ఉన్నతమైన స్థానంలో ఉండి మనకు మరిన్ని సేవలు చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ సర్పంచ్ సియ్యాదుల అచ్యుత్ కుమార్, మాజీ సర్పంచ్ వెదుళ్ల బంగారి , జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు అప్పలరాజు, లోవరాజు పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!