“నిర్వీర్యం అయిపోతున్న ఆదివాసి చట్టాలు” పట్టించుకునే నాధుడే లేడా? ఎక్కడ చూసినా గిరిజనేతరుల అక్రమ కట్టడాలు భూముల దందాలు!!
(అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అఖండ భూమి)
అల్లూరి జిల్లాలో ఆదివాసి చట్టాలు నిర్వీర్యం అయిపోతున్నాయి వీటిని పట్టించుకోవాల్సిన అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీలెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో రాను రాను ఆదివాసి చట్టాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది గిరిజన ప్రాంతాలలో ఆదివాసీలకు మాత్రమే ప్రత్యేకంగా అమలు చేయాల్సిన వన్ బై సెవెంటీ జీవో నెంబర్ 3 భూ బదలాయింపు చట్టం పీసా చట్టం గ్రామ సభ వంటి ఎన్నో విలువైన ఐదవ షెడ్యూల్లో పొందుపరిచిన ఆదివాసి చట్టాలు నేడు అధికారుల నిర్లక్ష్య ధోరణితో గిరిజనేతరుల చుట్టాలుగా మారుతున్నాయి చట్టాల అమలు కోసం నిరంతరం ఆదివాసి జేఏసీలు పోరాటాలు జరుపుతున్న అవి నామాత్రంగానే జరుగుతున్నాయి రోజురోజుకీ ఆదివాసి ప్రాంతాలలోని గిరిజన చట్టాలు ఉల్లంఘన జరుగుతున్న వాటిపై పెద్దగా పట్టించుకునే గిరిజన సంఘాలు తక్కువనే చెప్పాల్సి ఉంటుంది ఏదైనా ఆదివాసి ప్రాంతాలలో కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంటే దానిని కూడా ఒకరి మీద ఒకరు పోటీపడి కార్యక్రమం నిర్వహించామని చేతులు దులుపుకుంటున్నారే తప్ప పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం అన్నది ఎక్కడా జరగడం లేదు దీంతో ఆదివాసి ప్రాంతాలలో ఆదివాసి చట్టాలపై నిరంతరం పోరాటం చేసే గిరిజన సంఘం జేఏసీ వంటి సంఘాలు చేస్తున్న కార్యక్రమాలు పట్ల గిరిజన ప్రాంత ప్రజలు అయోమయంలో పడాల్సిన పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో ఆదివాసి ప్రాంత ప్రజలకు కీలకమైన జీవో నెంబర్ 3 రద్దు జరిగి సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు దానిపై స్థానిక సంస్థల ప్రతినిధులు గాని అధికార పార్టీ నాయకులు గాని స్పందించక పోవడమే కాకుండా అది తాము రద్దు చేయలేదని కోర్టు రద్దు చేసినందువలన తామేమి చేయలేమని చెప్పడం చూస్తుంటే ముందు ముందు మరిన్ని ఆదివాసి చట్టాలు కాలగర్భంలో కలిసిపోయే అవకాశం కనిపిస్తుంది ఆదివాసి ప్రాంత ప్రజల అభ్యున్నతికి అభివృద్ధికి వారి స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి చేపట్టిన ఆదివాసి చట్టాలు రాబోయే తరానికి పుస్తకాలలో తప్ప మరో విధముగాను చూపించడానికి అవకాశం లేని పరిస్థితి నెలకొంది జీవో నెంబర్ 3 కీలక చట్టాన్ని అత్యున్నత న్యాయస్థానం ఒక గిరిజన యాత్రను పెట్టిన ఫిర్యాదుకు సాక్షాలకు రద్దు చేయడం దానికి సంబంధించి గిరిజన సంఘాలు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు గాని ఏ విధమైన స్పందన స్పందించకపోవడం పట్ల ముందు ముందు ఆదివాసి చట్టాలు ఏమవుతాయా అన్న భావన కలుగుతుంది ఆదివాసి భూములకు కీలకంగా మారిన వన్ బై 70 చట్టం భూ బదలాయింపు చట్టం పీసా చట్టం గ్రామసభ చట్టం వంటి కీలక ఆదివాసి చట్టాలకు రానున్న కాలంలో నూకలు చెల్లిపోయే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి గిరిజన సంఘాలు ఆదివాసి జేఏసీలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి పోరాటాన్ని విస్తృతంగా చేపట్ట లేకపోతే ముందు ముందు వీటిని పుస్తకాల్లో తప్ప మరి ఎక్కడ చూసుకోలేని పరిస్థితి రాబోయే భావితరాలకు కలుగుతుంది ఆదివాసి ప్రజా ప్రతినిధుల్లారా ఇప్పటికైనా మేల్కోండి అల్లూరి ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న భారీ బాక్సైడ్ నిక్షేపాలను మైదాన ప్రాంతాలకు తరలించుకుపోవడానికి కొద్దికొద్దిగా ఆదివాసి చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు వీటిని గమనించి తగిన రీతిలో స్పందించకపోతే మరికొద్ది రోజుల్లోనే ఆదివాసి చట్టాలన్నీ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంటుంది ఇప్పటికైనా ఆదివాసి చట్టాల కోసం నిరంతరం పోరాడుతున్న ఆదివాసి జేఏసీలు గిరిజన సంఘాలు ప్రజాప్రతినిధులు తమ నిర్లక్ష్య వైఖరి ద్వారానే వీడి చట్టాల రక్షణకు పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది గిరిజనులు గిరిజన సంఘాల మధ్య ఉన్న అనేకత ఆధారంగా అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యాత్రల హవా రోజురోజుకీ పెరిగిపోతుంది పర్యాటక ప్రాంతాలు అల్లూరి జిల్లా కేంద్రమైన పాడేరు అరకు రంపచోడవరం వంటి కీలక ప్రాంతాలలో గిరిజన యాత్రల భూ దోపిడీలు పర్యాటక ప్రాంతాలలో ఆవాసాల ఏర్పాటు వంటివి పెరిగి వారి వ్యాపార లావాదేవీలు ఏజెన్సీలో జోరుగా కొనసాగుతున్నాయి పర్యాటక ప్రాంతాలుగా కొనసాగుతున్న అరకులోయ పాడేరు రంపచోడవరం వంటి ప్రాంతాలలో కీలకమైన భూములు ప్రస్తుతం గిరిజనేతరుల చేతుల్లోనే ఉన్నాయి రోజురోజుకీ ఆదివాసి చట్టాల నెర్వేరియంతో గిరిజనులు గిరిజనేతర్ల వద్ద పని కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఏజెన్సీలో నెలకొన్నాయి ఇప్పటికైనా మన చట్టాల రక్షణ వాటి మనుగడ వంటి ప్రధాన అంశాలే కీలకంగా పెట్టుకుని ఆదివాసి సంఘాలు ఆదివాసి జేఏసీలు ఆదివాసి ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి చట్టాల పరిరక్షణ కోసం పాటుపడకపోతే ఇక ఆదివాసి చట్టాల గతి స్థితి అంతే