అసెంబ్లీ ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ కే మా మద్దతు. -మాలమహానాడు.

హిమాయత్ నగర్:  హిమాయత్ నగర్ లోని దళిత బహుజన పార్టీ కార్యాలయం లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ను మాలమహానాడు జాతీయ అధ్యక్షులు, హై కోర్ట్ అడ్వకేట్ డాక్టర్. వి. ఎల్. రాజు, జాతీయ ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జె. ఎన్. రావు లు కలిసి దళిత బహుజన పార్టీ కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు దళితుల ఐక్యత కోసం ఎం. అర్. పి. ఎస్. మంద కృష్ణ మాదిగ కుట్రలను తిప్పి కొడుతూ ఎస్సీ వర్గీకరణ కు వ్యతిరేకంగా గత ఇరవై అయిదు ఏళ్ళుగా బలమైన గళం వినిపిస్తూ ప్రజా స్వామ్యం కోసం ప్రజా సమస్యలపై పోరాడుతున్న దళిత బహుజన పార్టీ అధినేత కృష్ణ స్వరూప్ నాయకత్వం నకు మాలల మద్దతు ఉంటుందన్నారు. వర్గీకరణ కు అనుకూలంగా రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం చేసిన బి. ఆర్. ఎస్, పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లుకు మద్దతు ఉంటుందని ప్రకటించిన కాంగ్రెస్, బీజేపి లకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.ఎస్సీ వర్గీకరణ కు అనుకూలంగా ఉంటూ మాలల ఆత్మగౌరవం ను దెబ్బతీసిన దోపిడీ కులాల పార్టీ లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మాలమహానాడు నేతలు హెచ్చరించారు. దళిత బహుజన పార్టీ పోటీ చేయని స్థానాల్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (అర్. పి. ఐ)పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని మాలమహానాడు నేతలు పిలుపు నిచ్చారు. ఈ సందర్భం గా దళిత బహుజన పార్టీ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ దళిత జాతి విచ్చిన్నం చేసే చర్యలు కు వ్యతిరేకంగా దళితుల రాజ్యాధికార సాధన కోసం దళిత బహుజన పార్టీ రాజకీయ పోరాటం చేస్తుందని ప్రకటించారు.దళిత బహుజన పార్టీ కి మద్దతు తెలిపిన మాలమహానాడు నేతలకు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో పార్టీ నగర అధ్యక్షులు మద్దెల ప్రవీణ్ కుమార్, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!