భారత రాజ్యాంగ సృష్టి కర్త డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్.

 

 

భారత రాజ్యాంగ సృష్టి కర్త డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్.

పార్వతీపురం, నవంబర్ 26 (అఖండ భూమి ) :బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ సృష్టికర్త న్యాయ కోవిదుడు రాజ్యాంగం ద్వారా దేశానికి దశ దిశ చూపిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఆదివారం స్థానిక పార్వతీపురం(బెలగాం) రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఆలిండియా రైల్వే ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ భువనేశ్వర్ జోన్ ఉపాధ్యక్షులు గందారపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం అసమానతలు వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడు కోట్లమంది జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం రైల్వే సూపరిండెంట్ పి. శ్రీనివాసరావు, జెఈ (ఎస్&టి) రాజశేఖర్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నర్సింగరావు, జిఆర్పి హెడ్ కానిస్టేబుల్ రత్నకుమార్, ఆల్ ఇండియా రైల్వే ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ పార్వతీపురం శాఖ కోశాధికారి ఆనందరావు, సిసి రఘు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News