నిజాంపట్నం( అఖండ భూమి) నిజాంపట్నం గ్రామంలో టైటాన్స్ మిత్రులు అద్భుతమైన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనివార్య కారణాలు వలన రాలేక పోయిన ఉపాధ్యాయ బృందం పూర్ణ చంద్ర శాస్త్రి దంపతులకు నూతన వస్త్ర శాలువాలు బహుకరణ,గ్రామం లో అనారోగ్యం కారణాలు వలన దురదృష్ట వశాత్తు మరణించిన మిత్రులు పేర్లి బాబావాలి, నాయుడు నాగార్జున, గూడపాటి శ్రీనివాసరావు గార్ల ధర్మపత్ని మణుల కుటుంబాలకు ఐదు వేల రూపాయలు నగదు, నూతన వస్త్రములు అందజేసి, మనది ఒక టైటాన్స్ కుటుంబమని, టైటాన్స్ మిత్రులు మీకు ఎల్లవేళలా అందుబాటులో వుంటామని వారిని ఉత్తేజపరచి ధైర్యం ఇచ్చారు.టైటాన్స్ మిత్రుల సహాయ సహకారాలతో మున్ముందు గ్రామం లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రసాదం వాసుదేవ, నర్రా నాగేశ్వర రావు, అబ్దుల్ సలీమ్, కొత్వాల్ మౌలాలి,మోపిదేవి నాగరాజు,నర్రా సుబ్బయ్య,గీతా వాణి,సరళ కుమార్,నజీర్, రాఘవ, రాజా, ఈసూబ్, శివ ప్రకాష్, అనిల్ ప్రభాకర్ తదితరులు ఒక ప్రకటన లో తెలియజేశారు.


