మాదిగలకు 21 అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలి
-
ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి రిప్రజెంటేషన్ సమర్పించిన
(ఎమ్మార్పీఎస్ఎస్)
మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న మాదిగలు విద్య వైద్యం ఉద్యోగ ఆర్థిక సంక్షేమ పరిశ్రమ రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నారు రిజర్వేషన్ ఫలాలు ఒకే సామాజిక వర్గం అనుభవించడంతో మాదిగ మాదిగ ఉప కులాలు నిరుద్యోగులుగా మిగిలిపోయి అన్యాయం జరుగుతుంది ఆర్థిక శాఖ మంత్రివర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాదిగలకు జరుగుతున్న రాజకీయ అన్యాయం పై పరిశీలించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి మాదిగలకు జరగబోవు 2024 ఎలక్షన్లో 21 అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలి
కృష్ణపట్నం వెదర్ ఇండస్ట్రీలు పున ప్రారంభించి బడ్జెట్ కేటాయించి మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో లెదర్ షాపులు ఏర్పాటు చేసి మాదిగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మాదిగల చిలుకలవంచ కోరికనటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో చర్చించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేందుకు కృషిచేసి మాదిగ మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందించాలి రద్దు పరిచిన 27 దళిత సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి మాదిగ మాల రెల్లి కార్పొరేషన్ లకు కార్పొరేషన్ చొప్పున వెయ్యి కోట్లు బడ్జెట్ కేటాయించి సొంత పూచికత్తుతో రుణాలు మంజూరు చేసి దళితులకు ఆర్థిక తోడ్పాటు కల్పించాలి దళితులపై రాష్ట్రంలో నిత్యం జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు హత్యలు, హత్యాచారాలు భూ కుంభకోణాలు నివారించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మంత్రివర్యులు గారిని కోరడమైనది స్పందించిన ఆయన ఎమ్మార్పీఎస్ఎస్ నాయకులు తెలిపిన డిమాండ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని పోయి సమస్యలు పరిష్కారమునకు చర్యలు తీసుకొని మాదిగలకు జరుగుతున్న రాజకీయ అన్యాయంపై చర్చించి న్యాయం చేస్తామని తెలపడమైనది
ఈ కార్యక్రమంలో
కర్నూలు జిల్లా కార్యదర్శి మద్దిలేటి మాదిగ
పత్తికొండ డివిజన్ కన్వీనర్ రామాంజనేయులు మాదిగ
ఎమ్మార్పీఎస్ఎస్ సలహాదారుడు ఏసేపు మాదిగ తదితరులు పాల్గొన్నారు


