డాక్టర్  శ్రీ బి ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

 

 

డాక్టర్  శ్రీ బి ఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి

డోన్ రైల్వే కాలనీ ఎంపీపీ స్కూల్ హెచ్ ఎం టి. వీరారెడ్డి

డిశంబర్ 06 న భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ డా. బి.ఆర్. అంబేద్కర్  వర్థంతి సందర్బంగా

డోన్ స్థానిక రైల్వేకాలనీలోని ఎం పి పి స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్కూల్ హెచ్ ఎం టి. వీరారెడ్డి అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్  వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళులర్పించారు. వారిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె.రామలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్కూల్ హెచ్ ఎం టి. వీరారెడ్డి, సామాజిక కార్యకర్త మహమ్మద్ రఫి, ఉపాధ్యాయులు జె.రామలక్ష్మి మాట్లాడుతూ

మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.

శ్రీ భీంరావ్ రాంజీ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891 జన్మించారు. “బాబాసాహెబ్” అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. వృత్తి రీత్యా న్యాయవాది.

భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ గారి సేవలు మరువలేనివని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6 న కన్ను మూశారు.

ఇలాంటి మహనీయుల అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ,డోన్ రైల్వే కాలనీ ఎంపీపీ స్కూల్ హెచ్ ఎం టి. వీరారెడ్డి కోరారు. అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి విద్యార్థులకు కాలుష్యం పై మరియు ఆరోగ్యం పై అవగాహణ కలిపించారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ అలవర్చుకొని మన దేశ భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను పాటించి దేశాభివృద్ధికి తోడ్పడాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.

 

[Image 1898.jpg]

Akhand Bhoomi News

error: Content is protected !!