ఆనకాపల్లి జిల్లా నాతవరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పార్టీ మండల అధ్యక్షులు నందిపల్లి వెంకట రమణ ఆధ్వర్యం లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు కరక సత్యనారాయణ,జిల్లా సెక్రటరీ కొండ్రు మరిడియ్య ముఖ్య అతిథిలు గా హాజరయ్యారు. సమావేశంలో మరిడియ్య మాట్లాడుతూ కార్యకర్తలందరూ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అందుకు సమిష్టి గా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అంతే కాకుండా సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర పాయకరావు పేట వద్ద అనకాపల్లి జిల్లా లోకి ప్రవేశం అవుతుందని ఈ సందర్భం గా పాయకరావు పేట లో ఈ కార్యక్రమానికి ఘనంగా స్వాగతం పలికేందుకు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున హాజరవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో టీడీపీ జిల్లా రైతు ఉపాధ్యక్షులు సీతారాం,యూత్ మండల అధ్యక్షులు శెట్టి లోవ,శెట్టి నానాజీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
అమెరికాలో శ్రీ శ్రీ కళావేదిక విస్తరణకు అడుగులు
క్రీడలకు కార్పొరేట్ ప్రోత్సాహం.. సోనస్ క్రికెట్ లీగ్-2026 కప్ ఆవిష్కరణ
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!


