తెలుగు దేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం యువ నేత నారా లోకేష్ యువ గళం పాదయాత్ర కాకినాడ జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాయక రావు పేట అసెంబ్లీ నియోజక వర్గం ద్వారా అనకాపల్లి జిల్లా లో ప్రారంభమై తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆనందోత్సవాలతో కార్యకర్తల కేరింతలు, మహిళల ఆశీర్వాదాల నడుమ దైవోత్సవం లా విజయవంతంగా కొనసాగుతుంది. అనేక మంది మహిళలు, యువత, రైతులు, నిరుద్యోగులు, బి.ఎడ్ విద్యార్ధులు వారి సమస్యలను వినతుల ద్వారా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి వాటన్నిటినీ పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేందుకు నాతవరం మండలం యస్. బి. పట్నం గ్రామం నుంచి సర్పంచ్ లోకవరపు సత్యనారాయణ ఆధ్వర్యం లో నాయకులు అంబటి రాంబాబు, పిరాట్ల పాపారావు, వేముల సతీష్, ఎడ్ల నాగసూరి బాబు, గాడి దేముళ్లు, సూరెడ్డి రాంబాబు, బొమ్మిరెడ్డి నాగేశ్వరరావు,ఎడ్ల మహేష్, గాడి శ్రీను మరియు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ANDHRA BREAKING NEWS NEWS PAPER POLITICS STATE

