తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం యువగళం పాదయాత్ర కాకినాడ జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గం లో మూడు వేల కిలోమీటర్లు మైలు రాయిని చేరింది. ఈ సందర్భంగా తేటగుంట పంచాయతీ లో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ప్రజలే సైన్యంగా కార్యకర్తలు, అభిమానుల తో ముందుకు సాగుతుంది. అక్కడ నుంచి ప్రారంభమైన పాదయాత్ర లో యువ నేత నారా లోకేష్ తో పాటు కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడి రాజబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కోటనందూరు మండలంలోని పలు సమస్యలను నారా లోకేష్ కి వివరించానని, అంతేకాకుండా నిరుద్యోగ సమస్య, డీఎస్సీ నోటిఫికేషన్, రైతు సమస్యలు, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులను గూర్చి ఆయనకు వివరించానని ఆయన అన్నారు . తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే త్వరితగతిన వాటన్నిటినీ పరిష్కరిస్తానని నారా లోకేష్ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. కోటనందూరు మండలంలోని అన్ని గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ANDHRA NEWS PAPER POLITICS STATE

