కోటనందూరు మండలం లోని అల్లిపూడి గ్రామం పసుపు జెండాలతో హోరెత్తింది. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నారా లోకేష్ యువ గళం పాదయాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా తేటగుంట పంచాయతీలో శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అల్లిపూడి గ్రామం నుంచి కోటనందూరు మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తేట గుంట చేరుకుని నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.

ANDHRA NEWS PAPER POLITICS STATE

